ఏపీ ఇంటర్ ఫలితాల్లో మనమ్మాయే టాప్..

223
AP Inter 1st, 2nd Year Results 2017
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గురువారం విడుదలైన ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫలితాల్లో తెలంగాణ అమ్మాయి సత్తా చాటింది. వేములవాడ పట్టణానికి చెందిన విద్యార్థిని ప్రథమస్థానంలో నిలిచింది.  రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడకు చెందిన వైద్యులు నాగమల్ల శ్రీనివాస్‌, పద్మలత చిన్న కూతురు యశశ్రీ విజయవాడలో శ్రీ చైతన్య విద్యాసంస్థలో బైపీసీ ప్రథమ సంవత్సరం చదువుతుంది.

పీసీ విభాగంలో 440 మార్కులకు యశశ్రీకి 436 మార్కులు వచ్చాయి. బోటనీ, జువాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ర్టీలలో ఆమె 60కి 60 మార్కులు సాధించింది. దీంతో కుటుంబ సభ్యులు సంబరాలు జరుపుకున్నారు. ఏపీ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్  ఫరీక్షల్లో బాలికలదే పై చేయి అయ్యింది. ఇంటర్ రెండో సంవత్సరంలో 77 శాతం మంది పాస్ అయ్యారు. ఇందులో బాలురు 74 శాతం పాస్ కాగా..80 శాతం బాలికలు  పాస్ అయ్యారు. ఫస్ట్ ఇయర్ లో 64 శాతం పాస్ మంది ఉత్తీర్ణులయ్యారు.

ఏపీ ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం గతేడాది కంటే ఈసారి పెరిగింది. వొకేషనల్‌ కోర్సుల్లో ప్రథమ సంవత్సరంలో 56 శాతం, ద్వితీయ సంవత్సరంలో 69 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాల వారీగా చూస్తే ఫస్టియర్, సెకండియర్‌ ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో ఉండగా, కడప జిల్లా ఆఖరి స్థానానికి పరిమితమైంది.

- Advertisement -