‘గుంటూరు కారం’ కొత్త షెడ్యూల్ అప్పుడే

133
- Advertisement -

మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న సినిమా గుంటూరు కారం. జ‌న‌వ‌రి 13, 2024న రిలీజ్ కానున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ నెక్ట్స్ షెడ్యూల్ ఈ పాట‌కే స్టార్ట్ కావాల్సింది కానీ ఆర్టిస్టుల కాల్షీట్ల కార‌ణంగా అది 22కి వాయిదా పడింది. ఇప్పుడు తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా త‌ర్వాతి షెడ్యూల్ జులై మొద‌టి వారానికి వాయిదా ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది. ఇక మహేష్ ఈ సినిమా తర్వాత రాజమౌళి సినిమా మీదకు వెళ్లాల్సి ఉంది. అందుకే, ఎట్టిపరిస్థితుల్లో త్రివిక్రమ్ ఈ సినిమాని చాలా వేగంగా పూర్తి చేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్నాడు.

Also Read: పెరిగిన విమర్శలు.. ప్రభాస్ ఎక్కడ

తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రానున్న ఈ సినిమా పూర్తి ఢిల్లీ నేపథ్యంలో సాగనుంది. పైగా ఈ సినిమాలో మహేష్ బాబు ఒక పొలిటికల్ అనలైజర్ గా కనిపించబోతున్నాడు. ఏది ఏమైనా ఖలేజా తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాలో హీరోయిన్లుగా పూజా హెగ్డేతో పాటు శ్రీలీల కూడా తన అందాలతో ఆకట్టుకోనుంది. రీసెంట్ గా గుంటూరు కారం నుంచి గింప్ల్ సైతం రిలీజ్ చేశారు మేకర్స్. మాస్ స్ట్రైక్ పేరుతో రిలీజ్ చేసిన ఈ వీడియో అదిరిపోయింది. దాంతో ఈ గుంటూరు కారం పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.

Also Read: WAR2:ఇంతకి హిరోయిన్‌ ఎవరో తెలుసా..!

- Advertisement -