కేసీఆర్‌ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి..

53
- Advertisement -

తెలంగాణ సీఎం కేసీఆర్‌ పేరును మంత్రి సత్యవతి రాథోడ్‌ తన చేతిపై పచ్చబొట్టు వేయించుకుంది. సీఎం కేసీఆర్‌పై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. గిరిజన యోధుడు కొమురం భీం సహచరుని వారసులతో మంత్రి పచ్చబొట్టు వేయించుకున్నారు. దశాబ్ది ఉత్సవాలల్లో భాగంగా బంజారహిల్స్ రోడ్‌ నెం 10లోని బంజారా భవన్‌లో నిర్వహించిన గిరిజన సంస్కృతి ఉత్సవాల్లో మంత్రి సత్యవతి పాల్గొన్నారు.

Also Read: KTR:ప్రజలందరికీ స్వపరిపాలనా ఫలాలు..

మంత్రికి ఆదివాసీలు బంజారాలు తమ సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల ఉత్పత్తులు ఫోటో ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌ను మంత్రి సందర్శించారు. అనంతరం మంత్రి కేసీఆర్‌ పేరును పచ్చబొట్టు వేయించుకున్నారు. కొమురంభీం సహచరుడు వెడ్మ రాము కోడలు రాంబాయి మంత్రిక పచ్చబొట్టు వేశారు. దీంతో ఆమెను అభినందించి నగదు బహుమానం అందించారు.

Also Read: 60యేళ్లలో కానీది..9యేళ్లలో చేసిన ఘనుడు సీఎం కేసీఆర్‌

- Advertisement -