తొమ్మిదేండ్ల కాలంలో దేశంలో ఏరాష్ట్రం చేయని అభివృద్ధి తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు సుపరిపాలన దినోత్సవం జరుపుకుంటున్నాము. నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సుపరిపాలన దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు, నగర మేయర్ దండు నీతూ కిరణ్, నుడ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ…పాలన సౌలభ్యం కొరకు ప్రజలకు మంచి సేవలు అందించడానికి అనేక రకాల పాలన సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. 10జిల్లాలతో ఏర్పడిన తెలంగాణను 33జిల్లాలుగా మార్చుకున్నామని అన్నారు. అన్ని శాఖల అధికారులు ఒకే చోట ఉండే విధంగా సమీకృత కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. తద్వారా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు తీరు పర్యవేక్షణ సులభమైందని అన్నారు. నూతన జిల్లాలు, నూతన జోన్లు, మల్టీజోన్ల ఏర్పాటుతో 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతున్నాయని తెలిపారు.
Also Read: రేపే గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష…
నూతన పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుతో రాష్ట్రంలో నేరాల తీవ్రత తగ్గిందని అన్నారు. అలాగే నేర పరిశోధన సులవైందని తెలిపారు. పేదరికాన్ని నిర్మూలించడం కోసం ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. 60యేళ్ల వెనుకబాటుకు కేవలం 9యేళ్లలో అభివృద్ధి పథంపై దూసుకుపోతున్నామని అన్నారు. ఇందుకోసం కృషి చేసిన ప్రతి ఒక్క అధికారికి ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.
Also Read: KTR:ప్రజలందరికీ స్వపరిపాలనా ఫలాలు..

