అరటి పండుతో లాభాలు…

237
banana
- Advertisement -

1.అరటి పండులో అత్యధికంగా పోటాషియం ఉంటుంది.ఇది బీపీ, అధిక ఒత్తిడి ని తగ్గిస్తుంది.

2.అరటిపండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ శరీరంలో ప్రవేశించగానే సెరటోనిన్‌గా మారి ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే రాత్రిపూట పాలు, అరటిపండు తీసుకుంటే నిద్ర బాగా పడుతుందని అని వైద్యులు చెప్తున్నారు.

3. జీర్ణ సంబంధమైన సమస్యలకు అరటి పండు మంచి ఔషదంలా పని చేస్తుంది.

4. పచ్చి అరటి కాయలు విరేచనాలనూ, పండినఅరటి పండ్లు మలబద్దకం, అల్సర్ల నూ నివారిస్తాయి.

5. అరటిపండ్లలో కణోత్పత్తిని ప్రోత్సహించే గుణం, జీర్ణాశయం గోడలకున్న సన్నటి పొర నాశనం కాకుండా కాపాడుతుంది.

6. 100 గ్రాముల అరటి పండులో… 90కాలరీల శక్తి, 10 గ్రాముల ఫైబర్, 12 గ్రాముల షుగర్ ఉంటాయి .అరటిపండు పిల్లల ఎదుగుదలకు చక్కగా ఉపయోగపడుతుంది.

7. అరటిపండ్లులో 105క్యాలరీలు శక్తి కలిగి ఉంటుంది. తక్షణ శక్తిని అందివ్వడంలో చాలా చక్కగా సహాయపడుతుంది.

8. అల్సర్‌కు అరటిపండు దివ్యౌషధంగా పనిచేస్తుంది. అరటిలో వ్యాధినిరోధక శక్తి అధికంగా ఉండటంతో అంటువ్యాధులు దరిచేరవు.

9. డయేరియాను తగ్గించడంలో అరటి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది చెడు బాక్టీరియాను మంచి బాక్టీరియాగా మారుస్తుంది.

10. రెండు అరటి పండ్లు, ఒక గుడ్డు, గ్లాసు పాలు, రెండు టేబుల్‌ స్పూన్ల తేనె కలిపి బనానా షేక్‌ తయారుచేసి ఉదయాన్నే తాగితే బలహీనంగా ఉన్నవారు బరువు పెరుగుతారు.

11.అరటి పండ్లులో విటమిన్ ఎ, విటమిన్ బి , విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. బాగా పండిన అరటి పండును మెత్తగా చేసి, అందులో కొద్దిగా తేనె చేర్చి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మ కాంతివంతంగా మారుతుంది .

12.అరటిలో ఉండే పొటాషియం రక్తపోటును అదుపు చేయడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -