విజయ్ మెర్సల్…జీఎస్టీ వీడియో…!

225
The GST scene in Mersel
- Advertisement -

ఇలయ దళపతి విజయ్‌ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన  మెర్సల్‌  అభిమానులకు దీపావళి ధమాకా అందించింది. అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. శ్రీ తేనాండాళ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై అట్లీ దర్శకత్వంలో రూపొందిన ‘మెర్సల్‌’లో విజయ్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి. మూడు పాత్రల్లోనూ వైవిధ్యాన్ని, చక్కని అభినయాన్ని ప్రదర్శించి తన కెరీర్‌లోనే మైలురాళ్లలో ఒకటిగా  మెర్సల్  నిలిచిపోయేలా చేశారు. పైగా, ప్రస్తుతం సమాజంలో చోటుచేసుకుంటున్న పలు అంశాలను తీవ్రంగా విమర్శించి రాజకీయ వర్గాల్లోనూ చర్చకు కారణమయ్యారు.

ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన చారిత్రాత్మక జీఎస్టీ విధానం, డిజిటల్ ఇండియా పై ఈ సినిమాలో ఉన్న డైలాగులు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ తమిళనాడు బీజేపీ నేతలు మండిపడుతున్నారు.  మెర్సల్ చిత్రంలో హీరో విజయ్…జీఎస్టీ గురించి చెప్పిన కొన్ని డైలాగులపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ”సింగపూర్ లో 7 శాతం జీఎస్టీ మాత్రమే ఉంది. అక్కడి ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. భారత్ లో 28 శాతం జీఎస్టీ ఉన్నప్పటికీ ఇక్కడ ఉచిత వైద్య సదుపాయాలు లేవు” అని విజయ్ కొన్ని డైలాగులు చెప్పాడు.  ఆ వీడియో మీకోసం…

- Advertisement -