మనసున్న….. రామన్న

217
Ktr for Medipally
- Advertisement -

ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకొని తక్షణం వారి సమస్యలను తీరుస్తూ  గొప్ప నాయకుడిగా ముద్ర వేసుకున్నారు మంత్రి కేటీఆర్. ఓ వైపు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాడంలో మరోవైపు పెట్టుబడులను ఆకర్షించడంలో కేటీఆర్ ఎనలేని కృషిచేస్తున్నారు. తమ సమస్య పరిష్కరించాలని విన్నవిస్తే చాలు స్పందించే కేటీఆర్‌..తాజాగా మరోసారి తన గొప్పమనసును చాటుకున్నాడు.

ktr-avva
నిరాశ్రయురాలైన ఓ అవ్వకు ఆశ్రయం కల్పించి తన గొప్ప మనసును చాటుకున్నాడు. 2017 ఫిబ్రవరి 23న తంగళ్లపల్లి మండలం రాంచంద్రాపూర్‌లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి కేటీఆర్‌ను , అదే గ్రామానికి చెందిన మేడిపెల్లి నీలవ్వ తమకు నిలువ నీడలేదని మంత్రికి విన్నవించింది. మగ పిల్లలందరూ చనిపోయారనీ, కూతురు వసంతతో కలిసి దయనీయ పరిస్థితుల్లో ఉన్నానని తన బాధను మంత్రికి చెప్పుకొంది.

దీంతో సొంతంగా ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చిన  రామన్న ఆ మాటను నిలబెట్టుకున్నారు. రూ.5.50 లక్షల సొంత ఖర్చుతో నీలవ్వకు డబుల్ బెడ్ రూం ఇంటిని కట్టించారు.  ఈ మేరకు శనివారం మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో పర్యటించనుండగా మొదట తంగళ్లపల్లి మండలం రాంచంద్రాపూర్‌లో తాను కట్టించిన ఇంట్లో ఉంటున్న నీలవ్వను కలవబోతున్నారు. మంత్రి కేటీఆర్ రాక కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నామని, ఆయనే మాకు పెద్ద దిక్కై ఇళ్లు కట్టించడం మా అదృష్టమంటూ  ఆ అవ్వ సంబురపడుతోంది.

- Advertisement -