మా రెండు కుటుంబాల మధ్య 35 ఏళ్లుగా పోరు నడుస్తోంది- ఎన్టీఆర్‌

36

దర్శక దీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌. జూ. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రూపొందిన ఈ భారీ పాన్‌ ఇండియా మూవీ వచ్చే ఏడాది జనవరి7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్లు జోరుగా చేస్తోంది. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రమోషన్ ఈవెంట్లతో బిజీ అయ్యాడు.

తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రామ్ చరణ్‌తో స్నేహంపై స్పందిస్తూ.. ఇప్పుడు ఈ విషయం చెప్పొచ్చో లేదో కానీ.. తమ రెండు కుటుంబాల మధ్య గత 35 ఏళ్లుగా పోరు నడుస్తోందని అన్నాడు. అయితే తాను, రామ్ చరణ్ మంచి స్నేహితులమని పేర్కొన్నాడు. తమ మధ్య పోరు ఎప్పుడూ సానుకూల ధోరణిలోనే ఉంటుందని ఎన్టీఆర్ స్పష్టం చేశాడు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దేశంలోని అగ్ర హీరోలందరూ భారీ మల్టీ స్టారర్ చిత్రాల్లో నటిస్తారని భావిస్తున్నట్టు తెలిపాడు.