వంగవీటి రాధాపై మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు..

112
- Advertisement -

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం చినగొన్నురు గ్రామంలో దివంగత వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వంగవీటి రాధా,జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక పాల్గొన్నారు.ఈ సందర్భంగా రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ వంగవీటి రాధాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వంగవీటి రాధా నాకు తమ్ముడు.. నేను వైసిపిలో ఉన్నాను, రాధ టిడిపిలో ఉన్నాడు అనుకుంటా?.. ఎమ్మెల్సీ ఇస్తామని అప్పటి టిడిపి నాయకులు చెప్పిన,పదవులను ఆశించకుండా ఆయన ఆ పార్టీలో చేరారు. బంగారం లాంటి రాదా, తన జీవితంలో కాస్త రాగి మిశ్రమాన్ని కలిపి రాజీపడితే పరిస్థితి మరోలా ఉండేది. రాగి కలిపితేనె బంగారం కూడా కావలసిన ఆకృతిలో వస్తుంది, కానీ కల్మషం లేకుండా తాను నమ్మిన దారిలోనే రాధా నడుస్తున్నాడని మంత్రి వ్యాఖ్యానించారు.

వంగవీటి రాధా మాట్లాడుతూ.. తనను చంపడానికి రెక్కీ నిర్వహించారని సంచలన ఆరోపణలు చేశారు. రంగా కీర్తి ,ఆశయాల సాధనే తన లక్ష్యం,పదవులపై ఆశ లేదు. తనను ఏదో చేద్దాము అనుకుని రెక్కీ నిర్వహించారు,నేను భయపడను అన్ని వేళలా తాను సిద్ధం అని అన్నారు. తనను పొట్టన పెట్టుకోవాలి అనుకునే వారికి నేను భయపడను,ప్రజల మధ్యే ఉంటాను గుర్తు చేశారు. తనను లేకుండా చెయ్యలనుకునే వారిని ప్రజలు దూరం పెట్టాలని కోరారు.

ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ..ఎన్టీఆర్,వైఎస్ఆర్,వంగవీటి రంగా లాంటి నేతలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారు. రాధకు అభిమానులు అండగా నిలవాలి అని అన్నారు. ఆశయ సాధన కోసం పోరాడిన వ్యక్తి వంగవీటి రంగా అని కొనియాడారు.

- Advertisement -