తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ సుభాష్ రెడ్డి..

21
justice

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వి.ఐ.పి‌ విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుభాష్ రెడ్డి, కేంద్ర‌ సహాయ మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్, ఏపి ఎమ్మెల్యేలు అప్పలనాయుడు, సిద్దారెడ్డి, మద్దలా గిరిధర్ రావు, తెలంగాణ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు వేర్వేరుగా స్వామి వారి సేవలో‌ పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.