కేరళలో ఎర్రతివాచీ..తొలిసారి సీఎం కానున్న స్టాలిన్

168
modi
- Advertisement -

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. అస్సాంలో బీజేపీ తిరిగి అధికారంలోకి రానుండగా కేరళలో చరిత్ర తిరగరాయనుంది సీపీఎం కూటమి. ఇక తమిళనాట డీఎంకే ప్రభంజనం సృష్టించగా స్టాలిన్ తొలిసారి సీఎం కానున్నారని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఇక బెంగాల్‌లో హోరాహోరి పోరు జరిగిందని…పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి మెజార్టీ సాధిస్తుందని జోస్యం చెప్పాయి ఎగ్జిట్ పోల్స్.

బెంగాల్‌లో మొత్తం 292 సీట్లు ఉండగా కనీస మెజారిటీ 147…. జన్‌కీబాత్‌ సర్వే బీజేపీకి 162-185 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అలాగే, రిపబ్లిక్‌-సీఎన్‌ఎక్స్‌ మై ఇండియా బీజేపీకి 138-148 సీట్ల వరకూ రావచ్చని పేర్కొంది. మరోవైపు, తృణమూల్‌కు స్పష్టమైన మెజారిటీ లభిస్తుందని టైమ్స్‌నౌ-సీఓటర్‌ సర్వే వెల్లడించింది. తృణమూల్‌కు 158, బీజేపీకి 115 సీట్లు లభిస్తాయి. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించిన పోల్‌ ఆఫ్‌ ఎగ్జిట్‌పోల్స్‌ ప్రకారం.. తృణమూల్‌కు 143, బీజేపీకి 133 సీట్లు దక్కనున్నాయి.

ఇక తమిళనాట డీఎంకే స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తుందని సర్వేలు వెల్లడించాయి. 234 సీట్ల అసెంబ్లీలో డీఎంకే-కాంగ్రెస్‌ కూటమికి 175-195 సీట్లు రావొచ్చని, అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి కేవలం 38-54 సీట్లు మాత్రమే వస్తాయని యాక్సిస్‌ మై ఇండియా అంచనాలు పేర్కొన్నాయి. సీఎన్‌ఎక్స్‌ సర్వే ప్రకారం డీఎంకే కూటమికి 160-170 సీట్లు, అన్నాడీఎంకే కూటమికి 58-68 సీట్లు వచ్చే అవకాశం ఉంది.

126 సీట్ల అస్సాం అసెంబ్లీలో బీజేపీ రెండోసారి వరుసగా అధికారంలోకి రానుందని సర్వేలు పేర్కొన్నాయి. ఇండియాటుడే-యాక్సిస్‌ మై ఇండియా అంచనాల ప్రకారం బీజేపీ కూటమికి 75-85 స్థానాలతో మంచి మెజారిటీనే లభించే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ 40-50 స్థానాలకు పరిమితం కానుంది.
కేరళలో ప్రతి ఐదేండ్లకోమారు ఎన్నికల్లో అధికార పార్టీ గద్దెదిగి ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వస్తుంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని

ఈసారి విజయన్‌ సారథ్యంలోని ఎల్డీఎఫ్‌ బ్రేక్‌ చేస్తుందని ఎగ్జిట్‌ అంచనాలు చెబుతున్నాయి. 140 సీట్ల అసెంబ్లీలో వామపక్షకూటమి 104 సీట్ల వరకూ గెల్చుకొని ఘన విజయం సాధిస్తుందని యాక్సిస్‌ మై ఇండియా సర్వే పేర్కొంది. టుడేస్‌ చాణక్య అంచనాల ప్రకారం.. ఎల్డీఎఫ్‌కు 93-111 స్థానాలు రానున్నాయి. కాంగ్రెస్‌ సారథ్యంలోని యూడీఎఫ్‌ కేవలం 26-44 సీట్లకే పరిమితమవుతుందని ఈ సర్వే పేర్కొంది.

- Advertisement -