- Advertisement -
హనుమంతని జన్మస్థలంపై వివాదం రోజు రోజుకు ముదురుతోంది. హనుమంతుని జన్మభూమి తీర్ద క్షేత్ర ట్రస్ట్ ఆరోపణలపై ఘాటుగా స్పందించింది టిటిడి. తమ వద్ద ఉన్న ఆధారాల నివేదికను తీర్దక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులకు పంపింది టిటిడి. టిటిడి చూపిన ఆధారాలు అసత్యాలు అయితే ఈ నెల 20వ తేదీలోపు ఆధారాలు సమర్పించాలని తీర్దట్రస్ట్ ప్రతినిధులను టిటిడి కోరింది.
కరోనా తీవ్రత తగ్గిన తరువాత చర్చలకు సిద్దమని…ఈ క్రమంలో టిటిడిపై హనుమద్ జన్మభూమి తీర్ద ట్రస్ట్ ఉపయోగించిన భాషపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వేంకటాచల మహాత్యాన్ని పౌరాణిక ఆధారంగా తీసుకున్నామని ..పౌరాణిక, చారిత్రక, శాసన, భౌగోళిక ఆధారాలు సేకరించామని …వేంకటాచలానికి అంజనాద్రితోపాటు 20 పేర్లు ఉన్నాయని ఇప్పటికే టీటీడీ వెల్లడించిన సంగతి తెలిసిందే.
- Advertisement -