కరోనా ఆస్పత్రులకు గుడ్ న్యూస్..!

186
corona
- Advertisement -

కరోనా ఆస్పత్రులకు గుడ్ న్యూస్ అందించింది ఆదాయపు పన్ను శాఖ. విడ్ చికిత్సను అందించే ఆసుపత్రులు, డిస్పెన్సరీలు, నర్సింగ్ హోంలు, కోవిడ్ కేర్ సెంటర్లు, ఇతర మెడికల్ ఫెసిలిటీలు కోవిడ్ రోగుల నుంచి రూ.2 లక్షలకు మించి నగదును స్వీకరించవచ్చునని తెలిపింది.

కోవిడ్ రోగులకు చికిత్స చేసే ఆసుపత్రులకు ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ ప్రత్యేకమైన వెసులుబాటు ఇచ్చింది. ఈ వెసులుబాటు మే 31 వరకు అమలవుతుందని తెలిపింది. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 269ఎస్‌టీ క్లాజ్ (iii) ప్రకారం లభించిన అధికారాలను వినియోగిస్తూ ఆ అనుమతిని మంజూరు చేసింది.

రోగి పాన్ లేదా ఆధార్ సంఖ్యను నమోదు చేసుకుని రూ.2 లక్షల కన్నా ఎక్కువ నగదును స్వీకరించవచ్చని… రోగికి, ఆ సొమ్మును చెల్లించేవారికి మధ్యగల సంబంధాన్ని కూడా నమోదు చేయాలని తెలిపింది.

- Advertisement -