పదవి కన్నా… దేశమే ముఖ్యం

267
The Accidental Prime Minister

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్. మన్మోహన్ సింగ్ పాత్రలో బాలీవుడు నటుడు అనుపమ్‌ ఖేర్‌ నటిస్తుండగా సోనియా గాంధీ పాత్రలో జర్మన్ నటి సుజానే బెర్నెర్ట్ కనిపించనున్నారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.

పదవి కంటే కూడా దేశ శ్రేయస్సే ముఖ్యమంటూ అనుపమ్‌ చెప్పే డైలాగ్స్‌ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అంతేకాకుండా మన్మోహన్‌ను మహాభారతంలోని భీష్మునిగా అభివర్ణించిన దర్శకుడు…. కశ్మీర్‌ వివాదం, అణు ఒప్పందం ప్రక్రియలో భాగంగా పార్టీతో ఆయన విభేదించడం వంటి సున్నితమైన అంశాలను ట్రైలర్‌లో చూపించారు. విజయ్‌ రత్నాకర్‌ గట్టీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జనవరి 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఆ ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేయండి…..

The Accidental Prime Minister | Official Trailer | Releasing January 11 2019