కంగనా జీవితానికి అది చాలు అట

39
- Advertisement -

కంగనా రనౌత్ అనగానే ఆమె వివాదాస్పద కామెంట్స్, ఆమె చేసిన ఎక్స్ పోజింగ్ స్టిల్స్ మాత్రమే గుర్తుకు వస్తాయి గానీ, నిజానికి కంగనాలో కోపం కంటే కూడా బాధే ఎక్కువ ఉంటుంది. ఆమె తన జీవితంలో వివక్ష, బెదిరింపులు ఎదుర్కొని పైకి వచ్చింది. నిత్యం సినిమా వాళ్ళ పై విరుచుకు పడే కంగనా రనౌత్.. సమాజాన్ని ప్రేమించడంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ముఖ్యంగా పెద్దలను గౌరవించడంలోనూ కంగనా రనౌత్ ముందు ఉంటుంది. సినీ రచయిత, ఎంపీ విజయేంద్ర ప్రసాద్ తన నటనను చూసి ప్రశంసలు కురిపించడంపై నటి కంగన రనౌత్ సంతోషం వ్యక్తం చేస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇంతకీ కంగనా ఏం పోస్ట్ చేసింది అంటే.. తన జీవితానికి విజయేంద్ర ప్రసాద్ గారి ప్రశంసలు చాలని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. తాను ప్రస్తుతం చేస్తున్న ఎమర్జెన్సీ సినిమా ఎడిటింగ్ పూర్తయిందని.. ఈ సినిమాని చూసిన తొలి వ్యక్తి విజయేంద్ర ప్రసాద్ గారు అని కంగనా రనౌత్ చెప్పుకొచ్చింది. సినిమా చూస్తూ ఆయన పలుమార్లు భావోద్వేగానికి గురయ్యారని కంగనా రనౌత్ చెప్పడం విశేషం. ఇక త్వరలోనే తన ఈ ఎమర్జెన్సీ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని కంగనా రనౌత్ పేర్కొన్నారు.

Also Read: 550టైమ్స్‌.. రీ-రిలీజ్ మూవీ ఓం

మొత్తనికి కంగనా రనౌత్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. నా జీవితానికి ఈ ప్రశంస చాలు అని తెలుగు సినీ రచయిత, ఎంపీ విజయేంద్ర ప్రసాద్ గురించి పొగడడం విశేషం. అన్నట్టు కంగనా రనౌత్ కి చాలా స్వచ్ఛంద సంస్థల్లో సభ్యత్వం ఉంది. చారిటీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. సొంతంగానూ నిర్వహిస్తున్నది. సామాజిక సేవ చేస్తోంది. కాబట్టి, ఇక నుంచి అయినా కంగనా రనౌత్ పై ప్రేక్షకుల్లో ఉన్న అభిప్రాయం మారుతుందేమో చూడాలి.

Also Read: Simhadri:వావ్.. రీరిలీజ్‌ లోనూ హౌస్‌ ఫుల్ బోర్డ్స్

- Advertisement -