కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం దాదాపు ఖాయమైపోయింది. ముందు నుంచి కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని సర్వేలు, నివేదికలు స్పష్టం చేశాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం హంగ్ ఏర్పడే అవకాశాలే ఎక్కువని తేల్చాయి. దీంతో కాంగ్రెస్ లో కొంత సందిగ్ధత నెలకొంది. ఇక నేడు ఫలితాల నేపథ్యంలో కౌంటింగ్ మొదట్లో కూడా కాంగ్రెస్ కొంత వెనుకంజలోనే ఉంది. అయితే అనూహ్యంగా పుంజుకొని బీజేపీ, జెడిఎస్ పార్టీలకు అందనంతా మెజారిటీతో హస్తం పార్టీ దూసుకుపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ జోరు చూస్తుంటే 130 నుంచి 140 స్థానాలను అలవోకగా గెలిచే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో ఏ పార్టీ అండ లేకుండానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థాపించబోతుంది.
Also Read: కర్ణాటక హస్తగతం..డీకే గెలుపు
అయితే హస్తం పార్టీ ఈ స్థాయిలో విజయం సాధించడానికి దోహదపడిన కారణాలెంటి అనే దానిపై విశ్లేషకులు వారియొక్క అభిప్రాయాలను బెల్లాబుచుతున్నారు. కాంగ్రెస్ విజయనికి దారితీశాన అంశాలలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణం అని చెప్పవచ్చు. బీజేపీ సర్కార్ పై కన్నడ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఆ వ్యతిరేకతనే కాంగ్రెస్ కు ప్లెస్ అయిందనే చెప్పవచ్చు. ఇవే కాకుండా రాహుల్ చేపట్టిన జోడో యాత్ర ప్రభావం, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిలో పెన్షన్ కు అర్హత కల్గిన ప్రభుత్వ ఉద్యోగులకు ఓపిఎస్ ని పొడిగించడం, రైతు చట్టలకు పూర్తి మద్దతు, నైట్ డ్యూటీ ఉన్న పోలీసులకు రూ. 5000 అలవెన్సులు, బజరంగ్ ధళ్, పీఎఫ్ఐ వంటి సంస్థలను నిషేడించడం వంటి తదితర అంశాలు ఓటర్లను అత్యంత ప్రభావం చూపాయని, ఈ కారణాలే కన్నడ ప్రజలను హస్తం పార్టీ వైపు చూసేలా చేశాయని కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట. మొత్తానికి కర్నాటక ఎన్నికల్లో విజయం సాధించి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కూడా మోడి సర్కార్ కు చెక్ పెట్టాలని హస్తం పార్టీ ఉవ్విళ్లూరుతుంది.
Also Read: కర్నాటకలో బీజేపీ ” ఖేల్ ఖతం ” !