ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి… షూటింగ్ పూర్తి

248
That Is Mahalakshmi

త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి షూటింగ్ పూర్తి చేసుకుంది. సాధార‌ణ యువ‌తి నుంచి అసాధార‌ణ మ‌హిళ‌గా ఎలా మారుతుంద‌నే క‌థ‌తో ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి సినిమా తెర‌కెక్కుతుంది. ఈ మ‌ధ్యే విడుద‌లైన టీజ‌ర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వ‌చ్చింది. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌తో బిజీగా ఉంది. త్వ‌ర‌లోనే చిత్రయూనిట్ విడుద‌ల తేదీని ప్ర‌క‌టించ‌నున్నారు. మైఖెల్ ట్యాబ్యురియ‌స్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా.. టైజాన్ ఖొరాకివాలా ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి సినిమాను స‌మ‌ర్పిస్తున్నారు. మెడైంటే ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్ పై మ‌ను కుమ‌ర‌న్ ప్రొడ‌క్ష‌న్ లో ఈ చిత్రం వ‌స్తుంది.

త‌మ‌న్నాను ప్ర‌ముఖ బాలీవుడ్ క్రిటిక్స్ రాజీవ్ మ‌సంద్, అనుప‌మ్ చోప్రా ఇంటర్వ్యూ చేసి సినిమా ప్ర‌మోష‌న్ ను ఘ‌నంగా మొద‌లు పెట్టారు. న‌టి ప‌రుల్ యాదవ్ ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌గా ఉన్నారు.

tamanna

న‌టీన‌టులు:త‌మ‌న్నా భాటియా, సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ,సాంకేతిక నిపుణులు:స‌మ‌ర్ప‌కులు: టైజాన్ ఖొరాకివాలా,నిర్మాత‌: మ‌ను కుమ‌ర‌న్, బ్యాన‌ర్: మెడైంటే,స‌హ నిర్మాత‌లు: ప‌రుల్ యాద‌వ్, పంక‌జ్ క‌పూర్, కే వెంక‌ట్రామ‌న్, మ‌నోజ్ కేశ‌వ‌న్ లైగ‌ర్, త్యాగ‌రాజ‌న్,అసోసియేట్ ప్రొడ్యూస‌ర్స్: జి మోహ‌న్ చంద్ర‌న్, హేట‌ల్ యాద‌వ్, యోగేష్ ఈశ్వ‌ర్ ధ‌బువాలా,సంగీతం: అమిత్ త్రివేది,సినిమాటోగ్ర‌ఫీ: మైఖెల్ ట‌బ్యూరియ‌స్, ఎడిట‌ర్: గౌత‌మ్ రాజు,కొరియోగ్ర‌ఫీ: బాస్కో సీజ‌ర్ ,పిఆరో: వ‌ంశీ శేఖ‌ర్