ఆ హీరో లైంగికంగా వేధించాడట

86
- Advertisement -

హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ క్యాస్టింగ్ కౌచ్ పై ఎందరో నటీమణులు యుద్ధమే చేశారు. తమ శక్తినంతా కూడగట్టుకుని పెద్ద పోరాటమే చేశారు. మహిళా లోకమంతా కూడా ఈ విషయం పై గట్టిగానే గళమెత్తింది. అయినా, నేటికీ గ్లామర్ ప్రపంచంలో బాధితులే నిందితులుగా నిలబడాల్సిన పరిస్థితి దాపురించడం నిజంగా బాధాకరమైన విషయమే. తాజాగా హీరోయిన్ నిత్యామీనన్ కూడా చీకటి రాత్రుల్లో సినీ లోకంలో జరిగే కీచక పర్వాల గురించి సంచలన ఆరోపణలు చేసింది.

నిత్యామీనన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘తెలుగులో నేను చాలా సినిమాలు చేశాను. కానీ, నా ఇష్టం లేకుండా ఎవరూ నన్ను ఇబ్బంది పెట్టలేదు. కానీ, కోలీవుడ్ లో ఓ సినిమా షూటింగ్ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఓ హీరో నన్ను బాగా వేధించాడు. ఎక్కడ పడితే అక్కడ అసభ్యంగా తాకుతూ.. నాతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడు. సినిమా కోసం చాలా భరించాను. కానీ ఒక్కోసారి అతను మరీ విచ్చలవిడిగా ఉండేవాడు. ఆ సమయంలో కూడా అతనికి సపోర్ట్ చేయాల్సి రావడం నిజంగా దారుణం’ అంటూ నిత్యామీనన్ సంచలన ఆరోపణలు చేసింది.

Also Read: బన్నీకి లాభాల పంట పండబోతుంది

అయితే, నిత్యామీనన్ మాత్రం ఆ హీరో పేరు మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం నిత్యామీనన్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అసలు, ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చింది కాదు. చాలా ఏళ్ల క్రితం నుంచే ఉంది. అందుకే తాజా నిదర్శనమే..నిత్యామీనన్ చేసిన కామెంట్స్.

Also Read: ‘ఆదిపురుష్’కి ఫస్ట్ డే 150 కోట్లు ?

- Advertisement -