ఈనెల 29న “ఈ న‌గ‌రానికి ఏమైంది”

253
e nagaraniki em ayendi
- Advertisement -

పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్ లో సంచ‌ల‌నం సృష్టించాడు డైరెక్ట‌ర్ తరుణ్ భాస్క‌ర్. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ తిసిన ఈసినిమా టాలీవుడ్ ట్రెండ్ సెట్ చేసిందని చెప్పుకొవ‌చ్చు. అంతే కాకుండా బాక్సాఫిస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. దింతో త‌రుణ్ భాస్క‌ర్ క్రేజ్ కూడా పెరిగిపోయింది. పెళ్లి చూపులు సినిమా త‌ర్వాత త‌రుణ్ భాస్క‌ర్ చాలా రోజ‌లు గ్యాప్ తీసుకుని “ఈ న‌గ‌రానికి ఏమైంది” అనే సినిమా తీశాడు. ఈచిత్రానికి సురేష్ బాబు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించాడు.

Ee Nagaraniki Emaindi

ఈ న‌గ‌రానికి ఏమైంది సినిమా ట్రైల‌ర్ ఇటివ‌లే విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్ కు ప్రేక్ష‌కుల్లో మంచి స్పంద‌న వ‌స్తోంది. న‌లుగురు స్నేహితుల మ‌ధ్య జ‌రిగే సంభాష‌ణ‌తో సినిమా కొన‌సాగుతోంది. సాధార‌ణ‌మైన భాషతో అద్బుత‌మైన డైలాగ్ ల‌తో ట్రైల‌ర్ తోనే ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకున్నారు. కొత్త న‌టుల‌తో ఈసినిమాను తెర‌కెక్కించాడు డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్. సుశాంత్ రెడ్డి, వెంక‌టేశ్ నాయుడు, అభినవ్, విశ్వ‌క్ సేన్ అనే న‌లుగురు కొత్త న‌టులు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

tharun bhasker, suresh babu

తాజాగా ఈసినిమా విడుద‌ల తేదిని ఖ‌రారు చేశారు చిత్ర‌బృందం. ఈనెల 29న భారీ స్ధాయిలో సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. పెళ్లిచూపులు సినిమాకు సంగీతం అందించిన వివేక్ సాగ‌ర్ ఈసినిమాకు కూడా బాణిల‌ను స‌మకూర్చారు. ఈచిత్రానికి పాట‌లు పత్ర్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయ‌న్నారు. త‌రుణ్ భాస్క‌ర్ మొద‌టి సినిమా పెళ్లిచూపులు ఘ‌న విజ‌యం సాధించ‌డంతో..ఈమూవీపై కూడా భారీ ఆశ‌లు పెట్టుకున్నారు ప్రేక్ష‌కులు.

- Advertisement -