కార్గిల్ వార్ కారకుడు…పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మరణంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపింది. దీనికి బదులుగా బీజేపీ దీటుగా సమాధానం ఇచ్చింది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ పార్లమెంటుపై దాడి జరిగింది. దుబాయిలో అరుదైన వ్యాధితో బాధపడుతు మరణించిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ముషారఫ్ మరణంపై ట్వీట్ చేశారు.
ఒకప్పుడూ భారతదేశానికి శత్రువు…కానీ 2002-2007మధ్య భారత్‌తో శాంతి స్థాపనకు నిజమైన శక్తిగా మారారు. ఆ రోజుల్లో ఆయన్ని ప్రతి యేటా ఐక్యరాజ్య సమితిలో కలిసేవాణ్ని. కలిసిన ప్రతిసారి వ్యూ హాత్మక ఆలోచనలతో తెలివిగా ఆకర్షణీయంగా స్పష్టంగా కనిపించేవారు అంటూ ముషారఫ్‌ను పొగుడుతూ ఆయన మరణంపై ట్వీట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు.
అయితే దీనిపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. థరూర్ ట్వీట్ కాంగ్రెస్ వైఖరిని, నిజస్వరూపంను ప్రతిబింబిస్తోందంటూ కేంద్ర మంత్రి రాజీవ్‌చంద్రశేఖర్ విమర్శించారు.మన దేశంలోకి ఉగ్రవాదాన్ని చొప్పించి …అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా మన సైనికులను హింసించిన వ్యక్తిలో మీరు శాంతిని వెతుకుతున్నారా?అని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి…