ఆ దర్శకుడితో చరణ్.. నిజమేనా ?

38
- Advertisement -

రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్‌’ సినిమాతో రామ్ చరణ్ కి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. అల్లూరి పాత్రలో చరణ్ నటించాడు అనడం కంటే జీవించాడు అనడం సబబు. చరణ్ నటనకు ఇండియాలోనే కాదూ.. గ్లోబల్‌గా గొప్ప ప్రశంసలు దక్కాయి. ఎందరో హాలీవుడ్‌ ప్రముఖులు రామ్ చరణ్ నటనకు ప్రశంసలు కురిపించారు. ఇక ప్రస్తుతం చరణ్ శంకర్ తో సినిమా చేస్తున్నాడు. అలాగే దర్శకుడు బుచ్చిబాబుతో మరో సినిమాకు సిద్ధమవుతున్నాడు. అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న శంకర్ సినిమా ఇప్పటికే ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇదిలా ఉంటే తాజాగా రామ్ చరణ్ మరో స్టార్ దర్శకుడికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

తమిళ దర్శకుడు అట్లీ కుమార్ తో చరణ్ ఓ సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. మాస్ ఎలిమెంట్స్ తో కంటెంట్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు రూపొందించడంలో తనకు తానే సాటి నిరూపించిన దర్శకుడు అట్లీ. కెరీర్‌ బిగెనింగ్‌ నుండి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కిస్తూ ప్రతిభావంతుడైన దర్శకుడిగా తమిళ ఇండస్ట్రీలో గొప్ప పేరు సంపాదించుకున్నాడు అట్లీ. అలాంటి దర్శకుడితో చరణ్ తన తదుపరి సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది.

నిజానికి గతంలోనే అట్లీ – చరణ్ కలయికలో ఓ ప్రాజెక్ట్‌ ఉండబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు దాదాపు ఈ కాంబో కన్ఫార్మ్‌ అయినట్లు కోలివుడ్‌ మీడియా కోడై కూస్తుంది. కానీ, ఈ వార్తలో వాస్తవం లేదు అంటూ మరోవైపు టాక్ నడుస్తోంది. నిజానికి అట్లీ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు అంటూ ఆ మధ్య బాగా టాక్ నడిచింది. కానీ ఇప్పుడు చరణ్ పేరు వినిపిస్తోంది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -