BB9:మహారాణిగా తనూజ

6
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 67 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా బిగ్ బాస్ మహారాణిగా నిలిచారు తనూజ. తాజా ఎపిసోడ్‌లో మాస్టర్ చెఫ్ సంజయ్ తుమ్మ ఎంట్రీ ఇచ్చి.. రాయల్ టాస్క్ డ్రామాని రక్తి కట్టించే ప్రయత్నం చేశారు. రాజ్యంలో రాజు, రాణిలకు ఎలాగైతే వడ్డిస్తారో.. వీళ్లకి కూడా అలాగే వడ్డించబోతున్నాను అని అనగానే.. హమ్మయ్య అని చేతులెత్తి దండంపెట్టేశారు రీతూ, కళ్యాణ్, నిఖిల్‌. నాన్ వెజ్ వంటకాలను రాజు, రాణిలకు వడ్డించగా రీతూ, కళ్యాణ్, నిఖిల్‌‌లు లొట్టలేసుకుని తిన్నారు.

ఇంతలో ఇమ్మానుయేల్.. తనూజ డైరెక్షన్‌లో సీక్రెట్‌‌గా కొన్ని ఫిష్ ముక్కల్ని దాచేశాడు. ఆ తరువాత రీతూ.. ఎవరూ చూడకుండా ఇమ్మానుయేల్‌కి ఒక పీస్ ఇవ్వడంతో.. దాన్ని పాపం బాత్ రూంలోకి పట్టుకుని వెళ్లి తిన్నాడు ఇమ్మానుయేల్.

పర్మిషన్ ఇస్తే.. కమాండర్స్ కూడా ఫుడ్ వడ్డిస్తాం అని అడిగారు సంజయ్. తప్పకుండా అని రాజు, రాణిలు అనడంతో.. కమాండర్ (డెమాన్) తింటే మేం తిన్నట్టే అని అన్నది రీతూ. దాంతో కమాండర్స్‌కి వడ్డించారు సంజయ్. తర్వాత పనోళ్లుగా ఉన్న భరణి, ఇమ్మానుయేల్, సుమన్‌ శెట్టి, గౌరవ్‌లకు శాఖాహార భోజనం వడ్డించారు. పనోళ్లు అంటే కింద కూర్చోబెట్టి పెట్టాలని బిగ్ బాస్ ఉద్దేశమో ఏమో కానీ.. వాళ్లని స్విమ్మింగ్ పూల్ దగ్గర కింద కూర్చోబెట్టి పెట్టారు.

Also Read:SSMB29:మహేష్ మూవీలో మాధవన్!

రేస్ ఆఫ్ గ్లోరీ టాస్క్‌లో రాజ్యం నుంచి కళ్యాణ్.. తన రాజ్యాధికారాన్ని కాపాడుకోవడానికి రేస్‌లో ఉండగా.. అతనితో పాటు తనూజ పోటీ పడింది. దివ్య సంచాలక్‌గా వ్యవహరించింది. అయితే టాస్క్‌లో తనూజ గెలిచింది. దాంతో తనూజని విన్నర్‌గా ప్రకటించింది దివ్య. రాజుగా ఉన్న కళ్యాణ్‌ని ఓడించి.. కొత్త రాణిగా నిలిచినందుకు బిగ్ బాస్ తనూజని అభినందించారు.

- Advertisement -