మహేష్ బాబు – రాజమౌళి సినిమా ‘SSMB29’ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ శనివారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో టైటిల్ లాంచ్ ఈవెంట్ జరగనుండటంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.
నిన్న చిత్రబృందం హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఆమెను “మందాకిని”గా చూపించిన ఈ పోస్టర్‌లో, సారీ ధరించి కనిపించే ప్రియాంక ఒక కనపడని శత్రువుపై తుపాకీతో కాల్పులు జరుపుతున్నట్లు చూపించారు.
ఆ పోస్టర్‌పై నటుడు ఆర్. మాధవన్ ఇచ్చిన స్పందన ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. సహనటుడి లుక్‌పై కామెంట్ చేయడం సాధారణమే అయినా, ఆయన ఇదే విధంగా పృథ్విరాజ్ సుకుమారన్ లుక్ పోస్టర్‌పైనా స్పందించడం విశేషంగా మారింది.
దీంతో నెటిజన్లు ఇప్పుడు మాధవన్ కూడా ఈ సినిమాలో భాగమని ఊహిస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రం శ్రీ దుర్గా ఆర్ట్స్‌కి చెందిన కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సంగీతాన్ని ఎం.ఎం. కీరవాణి సమకూరుస్తున్నారు.
Also Read:ప్రజాకవి కాళోజీ..వర్థంతి

