TRS గెలుపుకోసం పని చేసిన వారందరికీ కృతఙ్ఞతలు..

48
nri trs

లండన్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పౌరులందరికీ ఎన్నారై టి.ఆర్.యస్ వ్యవస్ధాపకధ్యక్షుడు అనిల్ కూర్మాచలం కృతఙ్ఞతలు. ప్రజాస్వామ్యంలో ఓటు ముఖ్యమైన ఆయుధమని, కానీ హైదరాబాద్ లాంటి అత్యధికంగా చదువుకున్న వారు ఉండే నగరంలో తక్కువ ఓటింగ్ శాతం జరగడం బాధ కలిగిందని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టి.ఆర్.యస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ కృతఙ్ఞతలు తెలిపారు, ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా పని చేసిన స్థానికులకు, ఎన్నారై టి.ఆర్.యస్ సభ్యులకు, మిత్రులకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

టి.ఆర్.యస్ పార్టీ సోషల్ విభాగం మరియు సోషల్ మీడియా బాధ్యులు వై.సతీష్ రెడ్డి, క్రిశాంక్ మరియు జగన్‌తో ఎప్పటికప్పుడు అందరినీ సమన్వయ పరిచి మరొక్కసారి టి.ఆర్.యస్ పార్టీ సోషల్ మీడియా సత్తాను చాటి చెప్పారని తెలిపారు. డిసెంబర్ నాలుగున వెలుబడే ఫలితాల్లో టి.ఆర్.యస్ పార్టీ అత్యధిక డివిజన్లు గెలుచుకొని బల్దియాలో గులాబీ జెండా ఎగురుతుందనే విశ్వాసం ఉందని అనిల్ కూర్మాచలం తెలిపారు.