ఓటు వేసిన ప్రతీ పౌరుడికి కృతజ్ఞతలు- మంత్రి కేటీఆర్‌

55
ktr minister

బల్దియా ఎన్నికల్లో ఓటు వేసిన ప్రతి ఒక్క నగర పౌరుడికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పని చేసిన ప్రతి ఒక్క టీఆర్ఎస్ పార్టీ నాయకుడికి, కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్స్ కి పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు.

మంగళవారం గ్రేటర్ పరిధిలోని 149 డివిజన్లలో పోలింగ్ జరిగింది. ఓల్డ్ మలక్‌పేట్‌లో గుర్తులు తారుమారుతో పోలింగ్ రద్దు చేశారు. ఎల్లుండి ఓల్డ్ మలక్‌పేట్‌లో రీ పోలింగ్ నిర్వహించనున్నారు. ఎల్లండి సాయంత్రం 6 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ నిషేధం కొనసాగనుంది. డిసెంబర్ 4న బల్దియా ఎన్నికల ఫలితాలు రానున్నాయి.