జూలై 8న థాంక్యూ!

89
chaitu
- Advertisement -

లవ్‌స్టోరీ, బంగార్రాజు వంటి హిట్ సినిమాలతో జోష్ మీదున్నారు నాగచైతన్య. ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ , దూత అనే థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తున్నాడు. వీటితో పాటు నందిని రెడ్డి, పరశురామ్ దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నారు.ఈ సినిమాలో చైతూ .. హీరో మహేశ్ బాబుకు వీరాభిమాని. అలాగే అతడో క్రికెటర్ కూడా. దీనికోసం ప్రత్యేకంగా ఒక్కడు, పోకిరి కటౌట్లు వేసి షూటింగ్ జరిపారు. చైతూ సరసన అవికా గోర్ కథానాయికగా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రఫర్ పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం నిర్వహిస్తున్నారు.

ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ పీసీ శ్రీరామ్‌ సినిమాటోగ్రఫీని అందిస్తుండగా త్వరలోనే టీజర్‌ని విడుదల చేయనున్నారు.

- Advertisement -