బాలీవుడ్ పై ఆర్జీవీ మార్క్ కామెంట్స్!

9
rgv

బాలీవుడ్‌ పై తన మార్క్ కామెంట్స్ చేశారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. సౌత్ సినిమా థియేటర్ కి వెళ్లి విజయం సాధిస్తున్నాయి, బాలీవుడ్ సినిమాలు మాత్రం అసలు థియేటర్ కి వెళ్ళడానికి కూడా ఆలోచిస్తున్నాయని విమర్శలు గుప్పించారు.

త్వరలోనే బాలీవుడ్ వాళ్ళు ఓటీటీల కోసమే సినిమాలు తీయాల్సి వస్తుందేమో అన్నారు. సౌత్ వర్సెస్ బాలీవుడ్ అని చర్చ నడుస్తున్న తరుణంలో ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి.

కొన్ని రోజులుగా బాలీవుడ్ సినిమాలు ఎక్కువగా ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి. ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ ప్రముఖులు ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.