రివ్యూ: థాంక్యూ

223
chaitu
- Advertisement -

విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన చిత్రం థాంక్యూ. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తుండగా రాశీఖన్నా, మాళవికా నాయర్‌, అవికాగోర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ కాగా ఆ అంచనాలను చైతూ అందుకున్నాడా లేదా చూద్దాం…

కథ:

నారాయణపురం అనే గ్రామానికి చెందిన అభిరామ్ (నాగ చైతన్య) …అక్కడ నుండి బిలినియర్ ఎలా అయ్యాడు అనే నేపథ్యంతో ప్రారంభమవుతుంది. అయితే అభిరామ్ తాను సొంతంగా ఎవరి సాయం లేకుండానే ఇంతవాడిని అయ్యానని అందరితో చెప్పుకుంటుండగా ఒకరోజు తన ఈ ప్రయాణం,విజయం వెనుక చాలా మంది వ్యక్తుల ప్రమేయం ఉందని తెలుసుకుంటాడు. అప్పటి నుండి వారి పట్ల తన కృతజ్ఞత చూపాలని నిర్ణయించుకుంటాడు…తర్వాత ఏం జరుగుతుంది? చివరికి కథ ఎలా సుఖాంతం అవుతుందనేదే సినిమా కథ.

ప్లస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ నాగచైతన్య, సినిమాటోగ్రఫీ, రన్ టైమ్‌. సినిమా మొత్తాన్ని తన భుజాలపై నడిపించాడు చైతూ. సవాల్‌తో కూడిన అభిరామ్ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. 17 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు లుక్స్ ,బాడీ లాంగ్వేజ్ పరంగా వేరియేషన్స్ ని అద్భుతంగా చూపించాడు.రాశీ ఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ సినిమాకు మరింత గ్లామర్ తీసుకొచ్చారు. మిగితా పాత్రల్లో ప్రకాశ్‌ రాజ్‌, తదితరులు మెప్పించారు.

మైనస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్‌ కథ ,ఫ్లాట్ కథనం,సంగీతం. క్లైమాక్స్ ఇంకా కొంచెం మెరుగ్గా ఉండాల్సింది. కథనం మలయాళం చిత్రం ప్రేమమ్‌ను పోలి ఉంటుంది.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. పిసి శ్రీరామ్ విజువల్ ఎప్పటిలాగే బాగున్నాయి. తమన్ పాటలు అంతగా ఆకట్టుకోలేదు. నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

తీర్పు:

లవ్ స్టోరీ తర్వాత చైతూ నటించిన చిత్రం థాంక్యూ. మనంతో మంచి పేరు తెచ్చుకున్న విక్రమ్ కుమార్ సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొనగా చైతూ నటన సినిమాకు ప్లస్ పాయింట్ కాగా కథ, క్లైమాక్స్ మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా ఈవీకెండ్‌లో చూడదగ్గ చిత్రం థాంక్యూ.

విడుదల తేదీ:22/07/2022
రేటింగ్:2.5/5
నటీనటులు:నాగ చైతన్య, రాశి ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్
సంగీతం: తమన్‌
నిర్మాత:రాజు, శిరీష్
దర్శకుడు:విక్రమ్ K కుమార్

- Advertisement -