బిగ్ బాస్ 4 తెలుగు…ఎపిసోడ్ 105 హైలైట్స్

48
episode 105 highlights

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 105 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. దాదాపు 4వ సీజన్ ముగియగా ఇవాళ సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ ఫినాలే ప్రారంభంకానుంది. ఇక 105వ ఎపిసోడ్‌లో భాగంగా మెహబూబ్,దివి,నోయల్,అవినాష్,గంగవ్వ,సుజాత ఇంటి సభ్యులతో కలిసి సందడి చేశారు.

తొలుత అఖిలు…ఓ అఖిలు అంటూ గంగవ్వ ఎంట్రీ ఇవ్వగా అందరిలో జోష్‌ వచ్చింది. గంగవ్వను అందరూ ఆప్యాయంగా పలకరించారు. గంగవ్వ వచ్చిన కాసేపటికే జోర్దార్ సుజాత ఎంట్రీ ఇచ్చింది. ఫైనలిస్ట్‌ల తల్లిదండ్రులు, స్నేహితులు ఈ వీడియో మెసేజ్‌ల ద్వారా వాళ్లను ఉత్సాహపరిచారు. తర్వాత నోయల్ కొత్త ర్యాప్ సాంగ్‌తో అదరగొట్టారు. ఈ పాటను మొదటిసారి విన్న ఫైనలిస్ట్‌లు అద్భుతంగా ఉందంటూ నోయల్ కొనియాడారు.

అరియానాకు ధైర్యం చెప్పి….ఆమెలో స్ఫూర్తిని నింపారు. తర్వాత మెహబూబ్ దిల్ సే, దివి జంటగా ఎంట్రీ ఇచ్చి డ్యాన్స్‌తో అదరగొట్టారు. దివిని చూసి దీపికా పడుకొనెలా ఉన్నావు అంటూ తన ఫీలింగ్ తెలిపారు అఖిల్.

ఇక రావణాసుర పాటతో ఎంట్రీ ఇచ్చాడు అవినాష్. పర్ఫార్మెన్స్ పూర్తయిన తరవాత అరియానా ఏడుపు ఆపుకోలేకపోయింది. నిన్ను చాలా మిస్ అవుతున్నా అవినాష్.. నేను ఇంట్లో మాట్లాడటం కూడా తగ్గించేశా అవినాష్ అంటూ కంటతడి పెట్టగా ఆమెను ఓదార్చాడు అవినాష్. తర్వాత అఖిల్‌ని ఆట పట్టించాడు అవినాష్. మోనాల్ పోయినందుకు బాధపడుతున్నావా.. ఇద్దరు అమ్మాయిలు ఉన్నందుకు హ్యాపీ ఫీలవుతున్నావా? అంటూ పంచ్‌లు విసిరాడు.