నో డౌట్.. ఆ విజయుడు రాజకీయ తెర పై కన్నేశాడు. ఈ విషయం ఏదో ఇప్పుడు ఉన్నట్టు ఉండి చెప్పింది కాదు. ఎప్పటి నుంచో తమిళ హీరో విజయ్ రాజకీయం పై మోజు పెంచుకున్నాడు. కానీ ఈ మధ్య ఆ మోజును బాహాటంగానే ఒప్పేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే లియో సక్సెస్ మీట్‌లో విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నాపై ఇంత అభిమానం ఉంచుకున్న మీకు ఏదైనా తప్పకుండా చేయాలనుంది. చేస్తా. మీ కాలు చెప్పులా ఉండటానికి కూడా వెనుకాడను.ఇప్పుడేం జరిగినా పట్టించుకోకండా అందరూ ఓపిక పట్టండి’ అని అన్నారు. ఇంతవరకు బాగానే ఉంది.
కానీ, ఆ తర్వాత విజయ్ పలికిన పలుకుల్లో రాజకీయ వాసనలు తగిలాయి. ఇంతకీ, ఈ హీరో గారు పలికిన రాజకీయ పలుకులు ఏమిటంటే.. ‘మనం పెద్ద విజయాన్ని అందుకోవచ్చు. మన లక్ష్యం సినిమా సూపర్ హిట్ అవ్వడం కాదు. వేరే ఉంది. అది గొప్పది. ఆ దిశగా అడుగులేద్దామన్నాడు. ఇలా సాగాయి విజయ్ మాటలు. కాదు, ఇవి కేవలం మాటలు మాత్రమే కాదు, తమిళ నాడులో తన రాజకీయ కోటకు విజయ్ తవ్వుకున్న పునాది రాళ్ళు. అసలు మీ కాలు చెప్పులా ఉండటానికి సైతం నేను సిద్ధం అని చెప్పాలి అంటే.. అది ఒక్క రాజకీయ నాయకుడికే సాధ్యం. కానీ హీరో విజయ్ ఆ ముక్కను మొహమాటం లేకుండా చెప్పేశాడు.
కాబట్టి, ఇక ఈ హీరో రాజకీయ నాయకుడే. అందుకే కాబోలు.. ఇటీవల వైరలవుతున్న సూపర్ స్టార్ కాంట్రవర్సీపై కూడా స్పందిస్తూ.. ‘తమిళంలో ఒక్కరే తలైవర్ ఆయన ఎంజీ రామచంద్రన్, ఒక్కరే నడిగర్ తిలగం ఆయనే శివాజీ గణేశన్, ఒక్కరే సూపర్ స్టార్ ఆయనే రజినీకాంత్. ఒక్కరే ఉలగనాయగన్ కమల్ హాసన్, ఒక్కరే తలా అజిత్. ఇక నేను దళపతి. దళపతి అంటే రాజు ఆదేశాన్ని పాటించేవాడు. అభిమానులంతా నా రాజులు. నేను మీ సేవకుడిని’ అన్నారు. మొత్తానికి ‘లియో’విజయోత్సవ వేడుకలో తన రాజకీయ వాంఛను విజయ్ నేమరవేసుకున్నాడు.
Also Read:Jagadish Reddy:పేదలకు భరోసా బీఆర్ఎస్