ఏప్రిల్ 23న కంగనా తలైవి..

62
thalaivi

దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవిత నేప‌థ్యంలో త‌లైవీ అనే చిత్రం తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవడ్ బ్యూటీ కంగనా ర‌నౌత్ ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తోంది. లాక్‌డౌన్ త‌ర్వాత శరవేగంగా సినిమా షూటింగ్ జరుపుకోగా మూవీ షూటింగ్ పూర్తి చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు చిత్రానికి సంబంధించి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు ఆక‌ట్టుకున్నాయి. ఈ మూవీని జ‌య‌ల‌లిత జ‌యంతి సంద‌ర్భంగా ఏప్రిల్ 23న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

లేడీ ఓరియెంటెడ్‌గా సాగే యాక్షన్‌ చిత్రమిదని చెప్పిన కంగనా, భారతీయ సినిమాలో ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా ఈ మూవీ నిలుస్తుందని చిత్రయూనిట్ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. తెలుగు, త‌మిళ‌, హిందీ బాష‌ల్లో ప్రతిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ సినిమాలో అర‌వింద‌స్వామి దివంగ‌త త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంజీ రామ‌చంద్ర‌న్(ఎంజీఆర్‌) పాత్ర‌లో న‌టిస్తున్నారు. అలాగే మ‌రో లెజెండ్రీ పొలిటీషియ‌న్, దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి క‌రుణానిధి పాత్ర‌లో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ న‌టిస్తున్నారు. విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్‌.సింగ్ నిర్మిస్తున్నారు.