గ్రీన్ కార్డు దారులపై నిషేధాన్ని ఎత్తేసిన బైడెన్…

125
biden

గ్రీన్‌కార్డు ద‌ర‌ఖాస్తుదారులు అమెరికాలోకి అడుగుపెట్ట‌కుండా ట్రంప్ ప్ర‌భుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. క‌రోనా కార‌ణంగా ఉద్యోగాలు కోల్పోయిన అమెరికా వ‌ర్క‌ర్ల హ‌క్కుల‌ను కాపాడేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్నానని ట్రంప్ చెప్పిన కారణం సరైందికాదని తెలిపారు బైడెన్.

డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణ‌యాలతో అమెరికా వ్యాపారాల‌ను తీవ్రంగా దెబ్బ‌తీశాయ‌ని వెల్లడించారు. ఎన్నికల సందర్భంగా తీసుకొచ్చిన ఎన్నో ఇమ్మిగ్రేష‌న్ విధానాల‌ను తాను రివ‌ర్స్ చేస్తాన‌ని బైడెన్ చెప్పిన విధంగానే ఒక్కో నిర్ణయాన్ని సమీక్షిస్తూ వస్తున్నారు. ఇప్పటికే గతేడాది తెచ్చిన పౌరసత్వ పరీక్షను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రద్దు చేశారు. అర్హులైన అభ్యర్థులందరికీ సిటిజెన్షిఫ్ ఇచ్చేందుకు 2008 నాటి పద్ధతినే అమలు చేస్తామని ప్రకటించారు.