అభిమానికి ‘నేకెడ్’ ఫోటో పంపిన శ్రీముఖి..!

47
Srimukhi

తెలుగు నాట యాంక‌ర్ శ్రీముఖి పేరు తెలియని వారుండరు. ఈ అమ్మడు ప్రస్తుతం గోవాలో ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తోంది. అయితే సామాజిక మాధ్య‌మాల్లో చురుకుగా ఉండే యాంక‌ర్ శ్రీముఖి త‌న అభిమానులు అడుగుతోన్న ప్ర‌శ్న‌ల‌కు అప్పుడ‌ప్పుడు సమాధానాలు ఇస్తుంటుంది. తాజాగా, ఆమె అభిమానులు అడిగే ఫొటోలు పంపుతాన‌ని, ఏదైనా ఆస‌క్తికర విష‌యాలు అడిగితేనూ చెబుతాన‌ని శ్రీముఖి త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో చెప్పింది.

ఈ క్రమంలో అభిమానులు అడిగిన ఫొటోల‌ను పోస్ట్ చేస్తుండగా.. ఓ అభిమాని ఆమె న‌గ్న ఫోటో అడిగాడు. దీంతో అత‌డికి శ్రీముఖి తన స్టైల్‌లో పంచ్‌ ఇచ్చింది. ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో తీసిన నేకెడ్, నగ్నం సినిమా టైటిల్ పేరును పంపింది. కాగా, నీ అభిమాన హీరో ఎవ‌ర‌ని శ్రీముఖిని మ‌రో అభిమాని అడ‌గ‌గా ఆమె చిరంజీవి ఫొటో పోస్ట్ చేసింది. త‌న‌కు ప‌ప్ప‌న్నం, ఆవ‌కాయ ఇష్ట‌మ‌ని మ‌రో అభిమాని ప్ర‌శ్న‌కు స‌మాధానంగా శ్రీముఖి చెప్పింది. అలాగే, ప‌లు ఆస‌క్తిక‌ర అంశాల‌కు స‌మాధానాలు చెబుతూ ఆమె ఇన్ స్టా స్టోరీస్ లో అనేక ఫొటోలు పోస్ట్ చేస్తోంది.