ఒక రోజు ముందే వస్తున్న రజనీ పెట్టా…

303
rajani petta
- Advertisement -

2.0 మూవీ భారీ హిట్ కొట్టిన సూపర్ స్టార్ రజనీ నెల రోజుల గ్యాప్‌లోనే మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు ముందుకువస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో పెట్టాగా సంక్రాంతికి వస్తుండగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డ్యుయల్‌ రోల్‌లో రజనీ నటిస్తుండగా హీరోయిన్లుగా సిమ్రాన్ – త్రిష నటిస్తున్నారు.

తమిళంలో ఈ సినిమాను జనవరి 11వ తేదీన అత్యధిక థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఒకరోజు ముందుగానే .. అంటే జనవరి 10వ తేదీనే తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా తాజాగా ప్రకటించారు.

Thalaivar is back

రజనీ కాంత్‌కు ఇది 165వ సినిమా కావడం విశేషం. విజయ్ సేతుపతి, శశికాంత్, సిమ్రాన్, మేఘా ఆకాష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, బాబీసింహా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా రైట్స్‌ని టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు దక్కించుకోవడంతో సినిమా హిట్ అని భావిస్తున్నారు సినీ విశ్లేషకులు.

- Advertisement -