ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు అమోదం..

247
Lok_Sabha
- Advertisement -

ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్ సభలో అమోదం పొందింది. విపక్షాల సూచనలను పట్టించుకోని ప్రభుత్వం బిల్లుకు యథాతథంగా అమోదం తెలిపింది. కాంగ్రెస్,అన్నాడీఎంకే,ఎస్‌పీ ఓటింగ్‌ను బహిష్కరించాయి. ఇక ట్రిపుల్ తలాక్‌కు అనుకూలంగా 245 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 11 మంది ఓటేశారు. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన ప్రతిపాదనలు వీగిపోయాయి. దాదాపుగా 4 గంటల పాటు ఈ బిల్లుపై లోక్‌ సభలో చర్చజరిగింది.

ట్రిపుల్ తలాక్ బిల్లును క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు జాయింట్ సెలెక్ట్ కమిటీకి పంపాల్సిందిగా ప్రతిపక్షాలు కోరాయి. అయితే వీటిని పట్టించుకోలేదు ప్రభుత్వం. ప్రత్యేకంగా ఏ మతాన్ని లక్ష్యంగా చేసుకొని ట్రిపుల్ తలాఖ్ బిల్లు తీసుకురావడం లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. దేశంలోని మహిళలందరికీ న్యాయం చేసేందుకు, మానవత్వాన్ని ప్రోత్సహించేందుకే ఈ బిల్లు తీసుకొచ్చినట్టు ఆయన తెలిపారు.

20 ఇస్లామిక్ దేశాలు ట్రిపుల్ తలాఖ్ ను నిషేధించాయని.. మన దేశంలో ఎందుకు కొనసాగించాలని ప్రశ్నించారు. ఇలాంటి బిల్లుని సభ ఇప్పటికే చర్చించి ఆమోదించినందువల్ల కమిటీకి పంపాలన్న డిమాండ్ ను అంగీకరించేది లేదని స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పష్టం చేశారు.

- Advertisement -