TGSRTC: సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

1
- Advertisement -

సంక్రాంతి పండగ రద్దీ నేపథ్యంలో ప్రత్యేక బస్సులు నడపనుంది టీజీఎస్‌ఆర్టీసీ. జనవరి 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 6,432 ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు వివరాలను వెల్లడించారు.

గత ఏడాది సంక్రాంతి పండుగ సందర్బంగా 5,240 ప్రత్యేక బస్సులను నడిపించగా, ఈ సంక్రాంతికి అదనంగా మరో వెయ్యి బస్సులను నడిపించనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించినట్లు తెలిపింది. హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రతిరోజూ 200 బస్సులు నడిపిస్తున్నామని వాటికి అదనంగా మరో 100 ప్రత్యేక బస్సులను నడిపించనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం వివరించింది.

రాష్ట్రవ్యాప్తంగా మహాలక్ష్మి ఉచిత రవాణా సౌకర్యం అమలు చేయడంతో మహిళా ప్రయాణికులు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నాయి. టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిన మహాలక్ష్మి ఉచిత రవాణా సౌకర్యం ప్రత్యేక బస్సుల్లోనూ యదావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ స్పష్టం చేసింది. మహిళలు తమ ఒరిజినల్ గుర్తింపు కార్డులు తమ వెంట తీసుకొనిరావాలని అధికారులు సూచిస్తున్నారు. ఉచిత ప్రయాణం చేసే మహిళలు కండక్టర్లకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Also Read:తెలంగాణలో పెరిగిన క్రైమ్ రేట్‌

- Advertisement -