అన్నలకు దెబ్బ మీద దెబ్బ-ఎన్‌కౌంటర్‌ తర్వాత నోటు.. పోటు..

276
Terrorists -Naxals starved of currency
Terrorists -Naxals starved of currency
- Advertisement -

దేశంలో రూ.500, రూ.1000 నోట్లు రద్దు అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రధాని నరేంద్ర మోడీ హఠాత్ ప్రకటనతో అందరూ నివ్వెరపోయారు. గురువారం నుంచి బ్యాంకులలో రూ.2000 నోట్లతో మార్చుకునే అవకాశమిచ్చారు. పెద్ద నోట్లను రద్దు చేసిన తరువాత కాశ్మీర్ లోయలో రాళ్లు రువ్విన దాఖలాలు కనిపించకుండా పోయాయని కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పరికర్ పేర్కొన్నారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన అభినందనలు తెలిపారు.సైనిక దళాలపై రాళ్లు రువ్వినందుకు రూ.500, మరేదయినా చేసినందుకు రూ.1000 వరకూ ఆశచూపించారు. తీవ్రవాద చర్యలను ప్రేరేపించే ఇటువంటి టెర్రర్ ఫండ్స్‌ను ప్రధాని మోడీ సున్నాకి తీసుకొచ్చారని పరికర్ వెల్లడించారు.

timthumb

ఇక పెద్ద నోట్ల రద్దు దెబ్బ సామన్యులకే కాదు.. మావోయిస్టులకూ గట్టిగానే తగిలింది. ఇప్పటికే ఏవోబీ ఎన్‌కౌంటర్‌తో కోలుకోలేకపోతున్న మావోయిస్టులకు నోట్ల రద్దు రూపంలో ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నోట్ల రద్దు ప్రకటనతో డంపులో దాచిపెట్టిన సొమ్ము అడవి పాలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కోట్లాది రూపాయల డబ్బును పేదలకు ఇచ్చే అవకాశాలు లేకుండా పోయాయి. ఒక వైపు భారీ కుంబింగ్, మరో వైపు డిసెంబర్ 30 వరకు మాత్రమే గడువు ఉండటంతో దాచుకున్న ధనాన్ని ప్రజలకు చేర్చి మార్పిడి చేసే అవకాశాలు లేకుండా పోయాయి.

513390-maoist-gunned-down-pti

ఇంతకుమందున్నడూ లేని ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడు మావోయిస్టులను చుట్టుముట్టాయి. గతంలో మావోయిస్టు పార్టీకి ఇబ్బడిముబ్బడిగా వచ్చిన ఫండ్‌ను డంపుల్లో దాచి పెట్టేవారు. పేదలకు పంచిపెట్టి ఆర్ధికంగా అదుకునే వారు. ఆయుధాల కొనుగోలుకు ఖర్చుపెట్టే వారు. కొంత మొత్తాన్ని బంగారం రూపంలో దాచిపెట్టే వారు. అయితే ఇప్పుడు మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో నోట్ల రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. అయితే రాబోయే రోజుల్లో ఆర్ధికంగా బలపడాలని మావోయిస్టులు యోచిస్తున్నారు. ఇన్నాళ్లుగా వచ్చిన ఫండ్ రాబోయే రోజుల్లో వచ్చే అవకాశాలు లేవని భావిస్తున్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులునైనా ఎదుర్కొనేలా ప్రణాళికలు రచిస్తున్నారు. పెద్ద నోట్లను మార్చుకునేందుకు ఏజెన్సీ గ్రామాల ప్రజలను ఉపయోగించుకోవాలని మవోలు వ్యూహం సిద్దం చేశారని పోలీసులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -