కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈనెల 23 నుంచి 30వ తేది వరకు జరగాల్సిన పరీక్షలను రీ షెడ్యూల్ చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. రేపు జరగాల్సిన పరీక్ష యాధావిధిగా జరుగనుంది. ఈనెల 30 నుంచి ఎప్రిల్ 6వరకు జరగాల్సిన పరీక్షలపై పరిస్ధితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ నెల 29న అత్యున్నత స్థాయి సమావేశం తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
కాగా నిన్నటి నుంచే రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిన్నటి నుంచే ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ నేపథ్యంలో పరీక్షలు కొనసాగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ భయబ్రాంతులకు గురిచేస్తున్న నేపథ్యంలో పరీక్షలు కొనసాగించడం సమజసం కాదని పిటిషనర్ తరపు న్యాయవాది పవన్ కుమార్ వాదించారు.