సీఎం కమల్ నాథ్ రాజీనామా..!

451
kamalnath cm
- Advertisement -

గత కొద్దిరోజులుగా మధ్యప్రదేశ్ రాజకీయాల్లో సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నేడు అసెంబ్లీలో కాంగ్రెస్ నేత, సీఎం కమల్ నాథ్ ప్రభుత్వం బల పరీక్ష ఎదుర్కోవాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమల్ నాథ్ సీఎం పదవికి రాజీనామా చేశారు దీంతో కాంగ్రెస్‌ వర్గాలు ఒక్కసారిగా షాక్‌ తిన్నాయి. అయితే కమల్‌నాథ్‌ చేయాలని ఆ పార్టీ కమాండ్ నుంచి కీలక ఆదేశాలు అందాయని ప్రచారం జరిగింది. చివరకు అదే నిజమైంది. సీఎం పదవికి కమల్‌నాథ్ రాజీనామా చేశారు. 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో అసెంబ్లీలో కాంగ్రెస్ మెజారిటీని కోల్పోవడంతో ఆయన బలపరీక్ష ఎదుర్కోక ముందే రాజీనామా చేయడం గమనార్హం.

రాజీనామా ప్రకటన సందర్భంగా సీఎం కమల్‌నాథ్‌ మీడియాతో మాట్లాడారు. 2018 డిసెంబర్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. 15 నెలల పాలనలో మధ్యప్రదేశ్‌ను అభివృద్ధి చేశాను. సమర్థవంతంగా ప్రజలకు పాలన అందించామని తెలిపారు. బీజేపీ 15 సంవత్సరాల్లో చేయలేనిది.. తాను 15 నెలల్లో చేసి చూపించాను అని స్పష్టం చేశారు. రైతులు తమపై ఎంతో విశ్వాసం ఉంచారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేశాం.. 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని కమల్‌నాథ్‌ పేర్కొన్నారు.

తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నించిందన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి బీజేపీ తమకు వ్యతిరేకంగా పని చేసింది. మధ్యప్రదేశ్‌ ప్రజల నమ్మకాన్ని బీజేపీ వమ్ము చేసిందన్నారు. ప్రజా తీర్పును బీజేపీ అవమానించిందని కమల్‌ నాథ్‌ పేర్కొన్నారు. రెబల్‌ ఎమ్మెల్యేలు రాష్ట్రానికి ద్రోహం చేశారు. తమ ఎమ్మెల్యేలను కర్ణాటకలో నిర్బంధించారు అని కమల్‌నాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -