చారిత్రాత్మక 500వ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో జట్టులోకి వచ్చిన కేఎల్ రాహుల్ (32: 39 బంతుల్లో 4×4, 1×6) ఆదిలోనే వరుస బౌండరీలతో ఆకట్టుకున్నాడు. జట్టు స్కోరు 42 వద్ద కివీస్ స్పిన్నర్ శాంట్నర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం వచ్చిన పుజారా (62:109 బంతుల్లో 8×4 చేసి శాంటర్న్ బౌలింగ్‌లో వెనుదిరుగగా..కెప్టెన్ కొహ్లీ 9 పరుగులు చేఇ వాగ్నర్ బౌలింగ్ లో పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తతుం క్రీజ్‌లో ఓపెనర్ మురళీ విజయ్ 62 పరుగులతో, రహానే 7 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 54 ఓవర్లలో 184/3.
మ్యాచ్ ప్రారంభానికి ముందుకు భారత మాజీ కెప్టెన్లందరినీ బీసీసీఐ ఘనంగా సన్మానించింది. కాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు బీసీసీఐ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోషియేషన్ మాజీ సారథులను జ్ఞాపికలతో సన్మానించింది. వెంగ్ సర్కార్, కపిల్ దేవ్, రవిశాస్త్రి, గంగూలీ, సచిన్ టెండూల్కర్, శ్రీకాంత్, అనిల్ కుంబ్లే, అజహరుద్దీన్, మహేంద్రసింగ్ ధోని తదితరులు సత్కారం పొందిన వారిలో ఉన్నారు.
క్రికెట్ లెజెండ్, మాస్టర్ బ్లాస్టర్, భారత టెస్ట్ క్రికెట్ హిస్టరీలో 40 శాతం (200 మ్యాచ్‌లు) ఆడిన సచిన్ టెండూల్కర్.. ప్రస్తుత టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు. వచ్చే పదేళ్లలో ఈ టీమ్ ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తుందని మాస్టర్ అన్నాడు. కోహ్లి సారథ్యంలోని ఈ యంగ్ టీమ్ మరో 8 నుంచి పదేళ్లు కలిసి ఆడుతుందని, ఈ కాలంలో ప్రపంచ క్రికెట్‌ను శాసించే సత్తా టీమిండియాకు ఉందని సచిన్ అన్నాడు. ఇక క్రికెట్లో బ్యాట్స్‌మెన్ హవా పెరిగిపోతోందని, దీనికి అడ్డుకట్ట వేసి బ్యాటింగ్, బౌలింగ్‌లను బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత క్రికెట్ పెద్దలపై ఉందని సచిన్ చెప్పాడు.
INTERVIEW – @sachin_rt speaks about his fondest of memories from Test Cricket, current #TeamIndia and morehttps://t.co/FBDKQcaTPn
— BCCI (@BCCI) September 22, 2016
ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో కెప్టెన్ కోహ్లి తుదిజట్టును ఎంచుకున్నాడు. వెస్టిండీస్ పర్యటనలో నిరాశపరిచిన ఓపెనర్ శిఖర్ ధావన్ జట్టులో స్థానం కోల్పోగా.. యువ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్‌పై కెప్టెన్ విశ్వాసం ఉంచాడు.
భారత్ జట్టు
విరాట్ కోహ్లి (కెప్టెన్), మురళీ విజయ్, లోకేశ్ రాహుల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్
న్యూజిలాండ్ జట్టు
కేన్ విలియమ్సన్ (కెప్టెన్,) లాథమ్, మార్టిన్ గప్తిల్, రాస్ టేలర్, లూక్ రోంచి, శాంట్నర్, వాట్లింగ్ (వికెట్ కీపర్), మార్క్ క్రేగ్, ఇష్ సోది, వాంగర్, ట్రెంట్ బౌల్ట్
Former #TeamIndia Captains felicitated ahead of #500thTest – @Paytm Test Cricket #INDvNZ pic.twitter.com/OzZGhQn4p0
— BCCI (@BCCI) September 22, 2016
#TeamIndia win the toss and elect to bat first in #500thTest @Paytm Test Cricket #INDvNZ pic.twitter.com/OQxE0Z63wn
— BCCI (@BCCI) September 22, 2016
Mr. Gavaskar reveals the story behind his hairdo – @Paytm Test Cricket #INDvNZ pic.twitter.com/gZpY7ImvRd
— BCCI (@BCCI) September 22, 2016