న‌వంబ‌ర్ 15న `తెనాలి రామ‌కృష్ణ బీఏ బీఎల్‌`

302
TRK PRESS STIL
- Advertisement -

యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం `తెనాలి రామ‌కృష్ణ `బీఏబీఎల్‌`. `కేసులు ఇవ్వండి ప్లీజ్‌` ట్యాగ్ లైన్‌. జ‌వ్వాజి రామాంజ‌న‌యులు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎన్‌.ఎస్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జ‌గ‌దీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

న‌వంబ‌ర్ 15న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. సినిమా టైటిల్ సాంగ్‌ను ఆదివారం(నవంబ‌ర్ 3) మ‌ధ్యాహ్నం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తెనాలి సంగ‌మేశ్వ‌ర సినిమాస్ థియేట‌ర్‌లో విడుద‌ల చేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్.ఎస్‌.త‌మ‌న్ టైటిల్ సాంగ్‌ను సోష‌ల్‌మీడియాలో విడుద‌ల చేశారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన సాంగ్స్‌కి, టీజ‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. హీరోయిన్ సందీప్ కిష‌న్ లాయ‌ర్‌గా న‌టిస్తున్న ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌ని జి.నాగేశ్వ‌రరెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. హ‌న్సిక హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది.

- Advertisement -