జీవితం అందరికీ ఆనందాలనే పంచదు:తెమ్జెన్‌ ఇమ్నా

159
- Advertisement -

రెప్పపాటు జీవితకాలం ఎన్నో ఆటుపోట్లు. జీవిత ప్రయాణమంటే ఎప్పుడూ ఒడుదొడుకుల పయనమే. అయిన వారికే తమ కష్టనష్టాలు తెలియకుండా దాచాల్సిన ఉద్విగ్న పరిస్థితులు ఎదురువుతుంటాయి. కుటుంబానికి దూరంగా ఉండి ప్రాణాలతో పోరాడుతూ జీవించాల్సిన సమయం ఉంటుంది. ఇటువంటి సంఘటనలు విధులు నిర్వర్తించే సైనికుల జీవితాల్లోని ఆనుభవాలు కొకొల్లలు. తాజాగా నాగాలాండ్‌ మంత్రి తెమ్జెన్‌ ఇమ్నా షేర్‌ చేసిన ఓ ఫోటో కూడా ఇలాంటిదే. ఎప్పుడూ హాస్యాన్ని పండించే తెమ్జెన్‌ ఈ సారి మనసుల్ని మెలిపెట్టేలా ట్వీట్‌ ఉంది.

విధి నిర్వహణలో గాయపడ్డ సైనికుడు…తన తండ్రి కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న కుమార్తెను ఒకే చిత్రంలో చూపించే ట్వీట్‌ అది. విధి నిర్వహణలో ఓసైనికుడి చేతికి తీవ్ర గాయమవుతుంది. దాంతో అతడు ఇంటికి చేరుకుంటాడు అప్పటికే తండ్రి కోసం ఎదురుచూస్తున్న కుమార్తె ఎంతో ఆనందంతో ఎదురొస్తుంది. అయితే తన గాయాన్ని చిన్నారికి చూపించి బాధపెట్టలేక చేతిని వెనక్కి దాచుకుంటాడు ఆ తండ్రి. అయితే ఆ చిన్నారి తన తండ్రి తనకు ఇష్టమైన స్వీట్లు తెచ్చి చూపించకుండా ఆటపట్టిస్తున్నాడని అనుకుంటుంది.

తండ్రిని బాధిస్తున్న గాయాన్ని ఆ పసి హృదయంలోని అమాయకత్వాన్ని కళ్లకు కట్టేలా గీసిన ఈ చిత్రాన్నే మంత్రి షేర్‌ చేశారు. జీవితం అందరికీ ఆనందాలనే పంచదు. అని ఆ ఫోటోకు వ్యాఖ్యను జోడించారు. ఇది నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు నిజమైన ఆనందాన్ని కొల్పోవడం అంటే ఇదే అని అంటున్నారు.

- Advertisement -