- Advertisement -
తెలంగాణలోని పలు జిల్లాలో వేసవి తాపం పెరిగిపోతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ భానుడి ప్రతాపం చూసిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఎండ తీవ్రత అధికంగా ఉంటుండగా, తోపుడు బండ్ల వ్యాపారులు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నగర పరిధిలోని నారాయణగూడలో అత్యధికంగా 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, సగటున ప్రతి ప్రాంతంలో 39 డిగ్రీల వేడిమి నమోదైంది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు హెచ్చరించారు. కాగా,సెంట్రల్ మహారాష్ట్ర పరిసరాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో, ఆ ప్రభావం తెలంగాణపై పడిందని, దీనివల్లే ఎండ వేడిమి పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
- Advertisement -