అభిమానులు గర్వపడేలా చేస్తా- హీరో నాని

192
nani hero

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ 2021లో ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందు‌తోంది. నాని స‌ర‌స‌న రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

నాని 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 23న ఈ సినిమా విడుద‌ల కానున్న‌ది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌ ప్రారంభించారు చిత్ర బృందం. ఇందులో భాగంగా పరిచయ వేడుక రాజమండ్రిలో జరిగింది. సినిమాలో ఏయే పాత్రల్లో ఎవరెవరు నటించారు? ఆయా పాత్రల స్వభావాలు ఏమిటి? అన్నది వివరిస్తూ… ‘టక్‌ జగదీష్‌’ కుటుంబాన్ని నాని పరిచయం చేశారు.

హీరో నాని మాట్లాడుతూ..తల్లి ఆశీర్వాదం లేనిదే టక్‌ జగదీష్‌ ఏ పనీ మొదలుపెట్టడు. అలాగే, నాకూ ఓ సెంటిమెంట్‌ ఉంది. మా అమ్మ ఆశీర్వాదం తీసుకోనిదే బయటకు వెళ్లను. టక్‌ జగదీష్‌ ప్రచారం ప్రారంభించే ముందు ఇక్కడి అమ్మలు అందరి నుంచి ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటున్నాను. మా అమ్మానాన్న నన్ను చూసి గర్వపడుతుంటారు. అలా అభిమానులు గర్వపడేలా చేస్తా అని నాని అన్నారు. వారం నుంచి శ్యామ్‌ సింగరాయ్‌ చిత్రీకరణ నిమిత్తం రాజమండ్రిలో ఉన్నాను. నానీగారూ… మీ వీరాభిమానిని. నాకు సెల్ఫీ ఇవ్వకపోతే షూటింగ్‌ జరగనివ్వను అన్నాడో వ్యక్తి. ప్రపంచంలో వార్నింగ్‌నూ అంత ప్రేమగా ఇవ్వగలిగేది రాజమండ్రి వాళ్లే అని నాని చెప్పారు.

చిత్రదర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ.. కొందరికి కులపిచ్చి… ఇంకొందరికి డబ్బు పిచ్చి ఉంటుంది. కానీ, నాకు నా కుటుంబం అంటే పిచ్చి అంటాడు టక్‌ జగదీష్‌. అదే సినిమా. కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలతో నిండిన ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. అన్నదమ్ములుగా నాని, జగపతిబాబును చూడటం ఐఫీస్ట్‌ అన్నారు.