భానుడి ప్రతాపంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మే రాక ముందే భానుడి భగభగలతో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ వేసవి నిప్పుల గుండంగా మారడం ఖాయమని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక రానున్న ఐదు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
రాబోయే ఐదు రోజుల పాటు దేశంలో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగన్నాయని ఐఎండీ వెల్లడించింది. దేశంలోని పశ్చిమ, మధ్య, తూర్పు ప్రాంతాలతోపాటు వాయివ్యంలోని కొన్ని చోట్ల 2 నుంచి 4 డిగ్రీ సెంటీగ్రేడ్ ల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఐఎండీ తెలిపింది.
బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో వడగాలులు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణ మార్పు ప్రపంచ ఉష్ణోగ్రతలను పెంచుతోందని… తీవ్రమైన వాతావరణ సంఘటనల ఫ్రీక్వెన్సీ, తీవ్రతను మరింత దిగజార్చుతోందని వెల్లడించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది.
ఇవి కూడా చదవండి..