తెలుగు రాష్ట్రాలు..వెదర్ అప్‌డేట్

6
- Advertisement -

తెలుగు రాష్ట్రాల వెదర్ అప్‌డేట్‌ను ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. తెలంగాణలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని తెలిపారు. మేఘావృతమైన వాతావరణం కారణంగా ముఖ్యంగా ఉత్తర/పడమర/మధ్య తెలంగాణలో వర్షం సంభవించవచ్చు అని తెలిపారు.

హైదరాబాద్ గరిష్ఠ ఉష్ణోగ్రత సుమారు 32°C ఉండవచ్చు అని…. సాయంత్రం లేదా రాత్రి సమయంలో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువగా ఉంటుందన్నారు.

ఉత్తర ఆంధ్రా మరియు రాయలసీమలో వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. విశాఖపట్నం గరిష్ఠ ఉష్ణోగ్రత సుమారు 34°C ఉండొచ్చు అని… తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.

Also Read:తెలంగాణలో కరోనా కలకలం..

- Advertisement -