తమన్నాపై కర్ణాటక ఎంపీ ఫైర్

6
- Advertisement -

మైసూరు శాండల్ సబ్బులకు, శ్రీ గంధముకు హీరోయిన్ తమన్నాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది కర్ణాటక ప్రభుత్వం. దీనిపై కర్ణాటక ఎంపీ కృష్ణదత్త ఒడియర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమన్నాకు కన్నడ రాదు.. ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా వద్దంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ పూర్వీకుడు కృష్ణరాజు ఒడేయర్ 1916లో పెట్టిన మైసూరు కంపెనీకి పరభాష నటులను అంబాసిడర్‌గా పెట్టడం ఏంటంటూ ఎంపీ కృష్ణదత్త ఒడేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కన్నడ భాష రాని వారికి, కర్ణాటక సంస్కృతి, సంప్రదాయం తెలియని వారిని రూ. 6.2 కోట్లు పెట్టి అంబాసిడర్‌గా పెట్టడం ఏంటంటూ కర్ణాటక ప్రజలు మండిపడుతున్నారు.

Also Read:TTD:‘డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

- Advertisement -