- Advertisement -
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. చింతపల్లి 8డిగ్రీలు , నమోదుకాగా లంబసింగిలో 6 డిగ్రీలు అరకు 12, పాడేరు 12 డిగ్రీలు నమోదు అయ్యాయి.
చలికి మన్యం వాసులు వణికిపోయారు. దీంతో ప్రజలు పొద్దు పొడిచే వరకు బయటకు రాలేకపోతున్నారు. సాయంత్రం మూడు గంటలకు చలి మొదలై ఉదయం 11 గంటల వరకు విడిచిపెట్టడం లేదు. చలిమంటలు వేసుకొని రగ్గుల కప్పుకొని మాస్కులు హ్యాండ్ బ్లౌజులు వేసుకొని చలి నుండి ఉపశమనం పొందుతున్నారు.
- Advertisement -