అమెజాన్‌కు భారీ జరిమానా..

202
amazon

ఆన్‌లైన్ దిగ్గజం అమెజాన్‌కు భారీ షాక్ తగిలింది. ఆ సంస్థకు రూ.202 కోట్ల జ‌రిమానా విధించింది కాంపిటీష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా. సీసీఐ అనుమ‌తి కోసం అమెజాన్ సంస్థ త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌లు చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ కేసులో సీసీఐ 57 పేజీల ఆర్డ‌ర్‌ను రిలీజ్ చేసింది. అమెజాన్, ఫ్యూచ‌ర్ గ్రూపు మ‌ధ్య కుదిరిన్ ఒప్పందాన్ని ర‌ద్దు చేస్తున్న‌ట్లు సీసీఐ చెప్పింది. సీసీఐ చ‌ట్టంలోని 45 సెక్ష‌న్ ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకున్నారు.

ఫ్యూచ‌ర్ గ్రూపుతో అమెజాన్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని సీసీఐ స‌స్పెండ్ చేసింది. సీసీఐ నుంచి అనుమ‌తి కోరిన స‌మ‌యంలో అమెరికాకు చెందిన అమెజాన్ సంస్థ కొన్ని విష‌యాల‌ను దాచిపెట్టిన‌ట్లు తెలిసింది.