గుడ్ ఫ్రైడే సందర్భంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సందేశం ఇచ్చారు. యేసు క్రీస్తు త్యాగాన్ని, ధైర్యాన్ని గుర్తు చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… ఏసు ప్రభు ప్రేమ, కృప కటాక్షాలు ఎప్పుడూ ప్రజలపై ఉండాలి అన్నారు.
శాంతి, కరుణ సందేశాలతో పాటు క్రీస్తు నేర్పిన సేవ, దయ, సోదరభావం ఇప్పటికీ ఎప్పటికీ మానవాళికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అన్నారు. క్రీస్తు త్యాగాల జ్ఞాపకంగా జరుపుకునే గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవ సోదర సోదరీమణులందరూ ఘనంగా జరుపుకోవాలి అన్నారు.
లోకానికి శాంతి దూతగా వచ్చిన ఏసుక్రీస్తుకు కల్వరి గిరిపై శిలువ వేసిన శుక్రవారం రోజును గుడ్ ఫ్రైడే గా నిర్వహిస్తాం అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. శరీరంలోకి మేకులు దించిన సమయంలో కూడా ఆ దేవదూత శాంతినే ప్రబోధించాడు. అందుకే ఆయన చూపిన మార్గం అనుసరణీయం. ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం రోజున జరుపుకునే ఈ పవిత్రదినం రోజు ఉపవాసం ఉండి ఆయనకు నివాళి అర్పించడం క్రైస్తవ సోదరులు పాటించే ఆచారం అన్నారు. క్రీస్తు త్యాగాన్ని స్మరించుకుంటూ, ఆయన బోధనలు పాటిస్తూ సర్వమానవ సమానత్వాన్ని, శాంతిని నెలకొల్పేందుకు కృషి చేద్దాం అని పిలుపునిచ్చారు.
Also Read:పెట్టుబడుల గమ్యస్థానం తెలంగాణ..

